మెదడు క్యాన్సర్ నివారణకు కేఎల్‌యూ విద్యార్థిని సరికొత్
తాడేపల్లిరూరల్: గ్లియో బ్లాస్టోమా మల్టీ ఫార్మ్(జీబీఎం)ను అదుపులో ఉంచడం ద్వారా మెడడు క్యాన్సర్‌ను నివారించే సరికొత్త విధానాన్ని కేఎల్‌యూ విద్యార్థిని కనిపెట్టినట్లు వర్సిటీ బయో టెక్నాలజీ ఆచార్యులు డాక్టర్ ఎం.జానకి రామయ్య బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ఔషధాల కొత్త కలయిక ద్వారా ఈ విధానాన్ని విద్యార్ధి సాహితి ఆర్ చామ కొనుగొందని వివరించారు. ఈ విధానంలో ప్రారంభ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో వర్శిటీ ఇన్‌చార్జి వైస్ చాన్సలర్ డాక్టర్ కె.రాజశేఖరరావు,ప్రో వీసీ డాక్టర్ ఎవిఎస్ ప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు, విద్యార్ధి సంక్షేమ విభాగం ఇన్‌చార్జి డీన్ డాక్టర్ కెఆర్‌ఎస్ ప్రసాద్, బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ వి.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment