జేఈఈ మెయిన్స్ విద్యార్థికి అభినందన
తెనాలి: జాతీయస్థాయి ఐఐటీ–జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో రికార్డు స్థాయిలో 99.37 పర్సెంటైల్ సాధించిన తెనాలి వివేక జూనియర్ కాలేజి విద్యార్థి తూనుగుంట్ల వెంకట పవన్‌కుమార్‌ను రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. తెనాలిలోని తన కార్యాలయంలో శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. పేద కుటుంబానికి చెందిన పవన్‌కుమార్‌కు ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పవన్‌కుమార్ వెంట ఉన్న వివేక విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె.రామరాజు, సీఈవో ఉదయ్‌కిరణ్‌ను మంత్రి మనోహర్ ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment