పోలీసుల అదుపులో దొంగలు
చేబ్రోలు: చేబ్రోలు గ్రామ పంచాయతీకి చెందిన పెద్ద మంచినీటి చెరువులో అర్ధరాత్రి సమయంలో చేపలు పట్టుకున్న ఇద్దరు స్టువార్టుపురం దొంగలు పోలీసుల అదుపులో ఉన్నారు. చేబ్రోలు పరిధిలోని కొమ్మమూరు చానల్‌కు పక్కనే ఉన్న 22 ఎకరాల మంచినీటి చెరువులో కొంతకాలంగా రాత్రి సమయాల్లో పెద్ద పెద్ద చేపలను పట్టుకొని వెళ్తున్నారు. నీళ్ల మోటార్లు, కాపర్, యంత్ర పరికరాలు అపహరణకు గురవుతుండటంతో పంచాయతీ కార్యదర్శి కారసాని శ్రీనివాసరావు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆటోలో వచ్చి నలుగురు దొంగలు మంచినీటి చెరువులోని పెద్ద పెద్ద చేపలను పట్టకుంటుండటంతో పంచాయతీ సిబ్బంది పథకం ప్రకారం వారిలో ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారయ్యారు. వీరంతా స్టువార్టుపురానికి చెందిన వారిగా గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కౌలు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కౌలు రైతులకు ఎటువంటి ష్యూరిటీలు లేకుండా పంట రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలని కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వి.జగన్నాథం డిమాండ్ చేశారు. ఈ మేరకు జీటీ రోడ్డులోని లీడ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కౌలు రైతులకు పెద్ద ఎత్తున పంట రుణాలు ఇచ్చామని చెప్పడం విడ్డూరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంజుల విఠల్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పచ్చల శివాజీ తదితరులు పాల్గొన్నారు.
హోంగార్డుపై యువకుడు దాడి
చెరుకుపల్లి: మద్యం మత్తులో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగాడు. వివరాలు.. గుళ్ళపల్లి గ్రామానికి చెందిన వాగు దినేష్ గురువారం సాయంత్రం మద్యం తాగి జాతీయ రహదారిపై వాహనాల ముందుకు వెళ్లాడు. ట్రాఫిక్ విధుల్లో ఉన్న కారంకి శ్రీనివాసరావు అనే హోంగార్డు, మరో కానిస్టేబుల్ ఎంత వారించినా వినలేదు. వారిని దుర్భాషలాడుతూ హోంగార్డు శ్రీనివాసరావును కింద పడేసి దాడి చేశాడు. చొక్కా చించేశాడు. ఎస్సై అనీల్‌కుమార్ సిబ్బందితో వచ్చి ట్రాఫిక్ నియంత్రించారు. దినేష్‌కు ఎంత చెప్పినా వినకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. హోంగార్డు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు.
పోలీసుల అదుపులో దొంగలు
Comments
Please login to add a commentAdd a comment