కవలలు... కన్నవారి కలల పిల్లలు
గుంటూరు ఎడ్యుకేషన్: కవలలు కన్నవారి కలల పిల్లలని ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ అన్నారు. శనివారం అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో కవలలకు పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ కవలలను కన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులని అన్నారు. పోటీల నిర్వాహకుడు పి.రామచంద్ర రాజు మాట్లాడుతూ ఒకే వేదికపై ఇంత మంది కవలల నైపుణ్యాలను ప్రదర్శించటం గొప్ప విషయమన్నారు. ఫ్యాషన్‌షో, ర్యాంప్ వాక్‌తో చిన్నారులు అలరించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. నిర్వాహకుల్లో ఒకరైన శ్రేష్ట హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గొట్టిపాటి నాగార్జున, డాక్టర్ వై.సుస్మిత, ప్రిన్సిపల్ హేమాంబ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సీతారామయ్య హైస్కూల్లో..
గుంటూరు ఎడ్యుకేషన్: లక్ష్మీపురంలోని శ్రీపాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో శనివారం ప్రపంచ కవలల దినోత్సవాన్ని నిర్వహించారు. కరస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్ మాట్లాడుతూ.. పాఠశాలలో 30 మంది కవల విద్యార్థులు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యుడు గింజుపల్లి వరప్రసాదరావు, అకడమిక్ డైరెక్టర్ లేళ్ల కృష్ణవేణి, ప్రిన్సిపల్ జంపని పద్మజ, ప్రైమరీ ప్రిన్సిపల్ కర్లపూడి పార్వతీదేవి, కో ఆర్డినేటర్లు దుర్గాశ్యాం, శ్రీదేవి పాల్గొన్నారు.
నెహ్రూనికేతన్‌లో..
తెనాలి అర్బన్: అంతర్జాతీయ కవలల దినోత్సవాన్ని బోసు రోడ్‌లోని నెహ్రూనికేతన్ ఇంగ్లిషు మీడియం స్కూల్‌లో శనివారం నిర్వహించారు. 9 మంది కవలలను విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు గీతాకాంత్‌లు అభినందించారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కవలలు... కన్నవారి కలల పిల్లలు
Comments
Please login to add a commentAdd a comment