డీఆర్‌ఎం కార్యాలయంలో బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభం
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ కార్యాలయ ప్రాంగణంలో పునరుద్ధరించిన బ్యాడ్మింటన్ కోర్టు, స్పోర్ట్స్ రూమ్‌ను డీఆర్‌ఎం రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కంటే నూతన హంగులు, ఆహ్లాదకర వాతావరణంలో కోర్టును నిర్మించడం అభినందనీయమని తెలిపారు. ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టం, రబ్బరు కుషన్ టెక్నాలజీతో కొత్త రకం కలపను అమర్చినట్లు చెప్పారు. డివిజన్ ఉద్యోగులంతా కోర్టులో కొంతసేపు ఆడి ఒత్తిడిని తగ్గించుకుని, ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రతి రోజూ 45 నిమిషాల పాటు వ్యాయామం, జీమ్, యోగా చేయడం వల్ల పనిలో ఉన్న ఒత్తిడిని కొంత మేర తగ్గించేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం సైమన్, సీనియర్ డీఓఎం ఎం.దినేష్‌కుమార్, ఏడీఎంఈ ఎం.రవీంద్రనాథ్, సీనియర్ డీసీఎం సీహెచ్.ప్రదీప్‌కుమార్, సీనియర్ డీఈఎన్ కో– ఆర్డినేషన్ జె.వి. అనూష, సీనియర్ డీఎఫ్‌ఎం అమూల్య బి.రాజ్, డీసీఎం కమలాకర్‌బాబు, ఏఎస్‌సీ శైలేష్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment