కల్యాణ వైభోగమే..!
● అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహాశివరాత్రి కల్యాణ బ్రహ్మోత్స వాలలో భాగంగా బుధవారం రాత్రి వేదమంత్రాల సాక్షిగా శాస్త్రోక్తంగా అర్చకులు గజవాహనంపై ఎదుర్కోలోత్సవం జరి పించారు. ఆలయ డీసీ గోగినేని లీలాకుమార్, అర్చకులు, భక్తుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా కల్యాణ క్రతువునకు ముందుగా తాంబూలాలు మార్చుకున్నారు. అనంతరం గురువారం తెల్లవారుజామున కనుల పండువగా భ్రమరాంబ మల్లేశ్వరస్వామివారి కల్యాణం జరిపించారు. ఆలయంలో జరిగే లింగోద్భవ కాలమున స్వామివారికి ఏకాదశ ద్రవ్యాలతో జరిగే అభిషేక పూజల్లో పాల్గొనేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఆయా ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించి పరవశించారు.
Comments
Please login to add a commentAdd a comment