లక్ష్మీపురం: ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ఎడిటర్లు, బ్యూరో చీఫ్‌లు, స్టాఫ్ రిపోర్టర్లు, సబ్ ఎడిటర్ల అక్రిడిటేషన్ కాలపరిమితిని మార్చి 1 నుంచి మే వరకు పొడిగిస్తూ విజయవాడలోని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 28తో ముగియనున్న కాల పరిమితిని పెంచినట్లు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో అక్రిడిటేషన్లు పొంది ఆయా మీడియా సంస్థల్లో ప్రస్తుతం పనిచేస్తున్న పాత్రికేయుల పేర్లతో తాజా జాబితాను మార్చి 1వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, గుంటూరు కార్యాలయంలో అందజేయాలని సూచించారు. జాబితాను కలెక్టర్, చైర్మన్ , జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదంతో గుంటూరు ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కు బస్సుల పాస్‌లు నిమిత్తం పంపనున్నట్లు వివరించారు.
కాకాని ప్రభకు ప్రమాదం
నరసరావుపేట రూరల్: కాకాని విద్యుత్ ప్రభ ప్రమాదానికి గురైంది. కోటప్పకొండ తిరునాళ్ల నుంచి తిరుగు ప్రయాణంలో గురవాయపాలెం సమీపంలోని 10ఆర్ మేజర్ కాలువపై అదుపుతప్పి నేలకొరిగింది. హైటెన్షన్ వైర్లను దాటించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. వెంట ఉన్న గ్రామస్తులు అప్రమత్తంగా ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. మరో క్రేన్ సాయంతో ప్రభను కాలువనుంచి బైటికి తీసి సిద్ధం చేశారు. తర్వాత గ్రామానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment