తెగబడి.. ఎగబడి
గుంటూరు
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 530.60 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 4,364 క్యూసెక్కులు విడుదలవుతోంది.
స్వామివారికి విశేష అలంకరణ
పిడుగురాళ్ల: పట్టణంలోని నాగులగుడిలోని గంగా పార్వతి సమేత భవానీ శంకరస్వామికి గురువారం విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.
స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలన
లక్ష్మీపురం: ఏసీ కళాశాలలోని స్ట్రాంగ్ రూముల్లో పోలింగ్ బాక్సులను భద్రపరిచే ప్రక్రియను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి,జేసీ ఏ భార్గవ్ తేజ పరిశీలించారు.
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కూటమి నేతలు గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రిగ్గింగ్‌కు, దొంగ ఓట్లకు పాల్పడి తప్పుడు సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజా వర్గీయులు పలుచోట్ల దాడులకు పాల్పడ్డారు. మంగళగిరిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు కుమారుడిపై దాడికి తెగబడ్డారు. కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక గురువారం జరిగింది. సాయంత్రం 4 గంటల సమయానికి కృష్ణా –గుంటూరు ఉమ్మడి జిల్లాలలో 65.59 శాతం ఓటింగ్ నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 62.61 శాతం నమోదైంది. రాత్రికి ఇది ఉమ్మడి జిల్లాలో 69.57 శాతానికి, గుంటూరు జిల్లాలో 66.45 శాతానికి పెరిగింది. పోలింగ్ ముగిసిన తర్వాత 4 శాతానికి పైగా ఓటింగ్ పెరగడంపై మిగిలిన అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పల్నాడులోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో తొంబైశాతం వరకూ పోలింగ్ నమోదు కావడంతో అక్కడ రిగ్గింగ్ జరిగిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 90 శాతం దాటిన ప్రతిచోట రీపోలింగ్ పెట్టాలని కోరుతామని పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు తెలిపారు.
ఓటమి భయంతో అక్రమాలు
ఓటమి భయంతో కూటమి నేతలు పెద్దఎత్తున అక్రమాలకు తెరలేపారు. ప్రణాళికాబద్ధంగా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించారు. ఉదయం పది గంటలకు పోలింగ్‌కు వెళ్లిన పలువురికి తమ ఓటు ఎవరో వేసేసారని చెప్పడంతో నిరాశగా వెనుతిరిగారు. పల్నాడుతోపాటు బాపట్ల జిల్లాలో కొన్ని చోట్ల పోలింగ్ ఏజెంట్లను బూత్‌ల నుంచి వెళ్లగొట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద కూటమి నేతలు పెద్దఎత్తున హల్‌చల్ చేశారు. కూటమి నేతలు ప్రచారం చేస్తున్నా పోలీసులు మిన్నకుండిపోయారు. మరికొన్ని చోట్ల సహకరించారు. ఓటరు స్లిప్‌లతో పాటు డబ్బులు కూడా పంపిణీ చేశారు. అదేసమయంలో పీడీఎఫ్ నేతలను దగ్గర ఉండకుండా వారిని పంపించి వేశారు.
దాడులు.. దొంగ ఓట్లు
మధ్యాహ్నం మూడున్నర నుంచి పెద్దఎత్తున గుంపులు గుంపులుగా వెళ్లి దొంగ ఓట్లు వేశారు. కొంతమందిని పీడీఎఫ్ అభ్యర్థి తాలూకా వాళ్లు పట్టుకుని పోలీసులకు అప్పగించినా తర్వాత వారిని వదిలిపెట్టేశారు. ఆలపాటి రాజాకు సొంత పార్టీతో పాటు కూటమి నేతలు కూడా మొదటి నుంచి సహాయ నిరాకరణ చేయడంతో ఓటమి భయంతో రిగ్గింగ్, దొంగ ఓట్లను నమ్ముకున్నట్లు పోలింగ్ సరళిని చూస్తే స్పష్టంగా కనపడుతోంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు బూత్‌లలో తిరుగుతూ హడావిడి చేశారు. చీఫ్ ఏజెంట్లు, అభ్యర్థులు మినహా ఎమ్మెల్యేలకు బూత్‌లలోకి వెళ్లే అధికారం లేకపోయినా వారు హడావిడి చేశారు. తెనాలిలోని కోగంటి శివయ్య మున్సిపల్ పాఠశాలలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేశారు. గుంటూరులో జనసేన నేతలు హడావిడి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేశారు. చలమయ్య హైస్కూల్ వద్ద జనసేన నాయకుడు చల్లా ప్రసాద్ పీడీఎఫ్ సభ్యులు శనగపల్లి కార్తీక్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రంగప్పలపై దాడికి పాల్పడ్డాడు. మంగళగిరిలో కేఎస్ లక్ష్మణరావు కుమారునిపై దాడికి తెగబడ్డారు. అదే సమయానికి పోలీసులు రంగప్రవేశం చేసి తెలుగుదేశం నాయకులను అడ్డుకున్నారు. మంత్రి లోకేష్ తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో వారు కిందిస్థాయిలో రెచ్చిపోయి దొంగ ఓట్లు వేయించారు.
మంగళగిరిలో సీకే హైస్కూల్ కేంద్రం వద్ద కేఎస్ లక్ష్మణరావు కుమారుడు, డ్రైవర్‌తో ఘర్షణ పడిన
టీడీపీ వర్గాలు.. ఇరు వర్గాలను అదుపు చేస్తున్న పోలీసులు
I
న్యూస్‌రీల్
ఎక్కడికక్కడ ిపీడీఎఫ్ ఏజెంట్ల
అడ్డగింత
పలుచోట్ల దాడులకు తెగబడ్డ
కూటమి నేతలు
పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు
కుమారుడిపైనా దాడి
పోలింగ్ కేంద్రాల వద్దే డబ్బులు పంపిణీ
కూటమి అభ్యర్థికి అండగా పోలీసులు
కేంద్ర కార్యాలయం నుంచి
ఎప్పటికప్పుడు సమీక్షించిన లోకేష్
తెగబడి.. ఎగబడి
తెగబడి.. ఎగబడి
తెగబడి.. ఎగబడి
తెగబడి.. ఎగబడి
తెగబడి.. ఎగబడి
తెగబడి.. ఎగబడి
తెగబడి.. ఎగబడి
Comments
Please login to add a commentAdd a comment