చూసిన కనులదే భాగ్యం
వైభవంగా శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి తెప్పోత్సవం
పెదకాకాని: మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్థానిక శివాలయంలో శుక్రవారం స్వామి తెప్పోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పుష్పమాలలు, విద్యుత్ కాంతులతో శోభాయమానంగా అలంకరించిన హంస వాహనంపై ఉత్తర భాగాన ఉన్న మంచినీటి చెరువులో స్వామి విహరించారు. ఉదయం పెదకాకాని పుర వీధుల్లో అశ్వ వాహనంపై మేళతాళాల నడుమ గ్రామోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ముందుగా అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెదకాకాని భక్త బృందం కోలాట ప్రదర్శనలు, కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment