చిరు వ్యాపారులకు అండగా నిలవాలి
నగరంపాలెం: చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు సమష్టి నిర్ణయంతో చిన్న వ్యాపారులకు బ్యాంకు రుణాలు ఇప్పించి అండగా నిలవాలని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికై న యేల్చూరి వెంకటేశ్వర్లుకు ఆత్మీయ సన్మాన మహోత్సవం, రజత కిరీటంతో ఆదివారం శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సత్కరించారు. తొలుత అతిథులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ కొత్తగా వ్యాపారాలు చేసే వారికి అవగాహన కల్పించాలని అన్నారు. బ్యాంక్ అధికారులతో మాట్లాడి రుణాలు ఇప్పించే దిశగా ముందుకెళ్లాలని సూచించారు. ఆన్‌లైన్‌లో డిజిటల్ మార్కెటింగ్ పై శిక్షణ అందించాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను వ్యాపారులకు వివరించాలని అన్నారు. క్రేన్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి కాంతారావు మాట్లాడుతూ చాంబర్ ఆఫ్ కామర్స్ గతంలో కొంతమేర నిర్వీర్యమైపోయిందని అన్నారు. ఇప్పటికై నా ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. ఇకనైనా సభ్యత్వ నమోదు పక్రియను వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా ఐసీసీకి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సన్మాన గ్రహీత ఐసీసీ అధ్యక్షుడు యేల్చూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యాపారులకు అండగా ఉంటానని చెప్పారు. ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, కన్నా లక్ష్మీనారాయణ, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్‌కుమార్‌లు మాట్లాడారు. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్‌కృష్ణ, ఐసీసీ శాశ్వత గౌరవాధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, డిప్యూటీ మేయర్ సజల, కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, పోతురాజు సమత, నాయకులు కొనకళ్ల సత్యం, కొత్తూరు వెంకట్ పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులుగా వెచ్చా కృష్ణమూర్తి, దేవరశెట్టి సుబ్బారావులు వ్యవహరించారు.
ఐసీసీ అధ్యక్షుడి సన్మాన సభలో
కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని
Comments
Please login to add a commentAdd a comment