గుర్తుతెలియని మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Published Mon, Mar 3 2025 2:11 AM | Last Updated on Mon, Mar 3 2025 2:10 AM

గుర్త

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

తాడేపల్లిరూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని పాత జాతీయ రహదారి వెంబడి ఐఓసీ ఎదురుగా తాడేపల్లి పోలీసులు గుర్తుతెలియని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లి ఎస్‌ఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం ఐఓసీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వృద్ధుడి మృతదేహం ఉందనే సమాచారం అందడంతో వెళ్లి పరిశీలించామని, ఆ మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని, మృతుడి వయస్సు సుమారు 55–60 మధ్య ఉండవచ్చని, ఎవరైనా గుర్తిస్తే తాడేపల్లి పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.

రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడు మృతి

తెనాలిరూరల్‌: రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తెనాలి–విజయవాడ రైలు మార్గంలో చిలువూరు స్టేషన్‌ సమీపంలో పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో ఆదివారం రాత్రి తెనాలి రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 65 నుంచి 70 ఏళ్లు ఉంటాయని తెలిపారు. మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడని భావిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9440627554 నంబరులో సంప్రదించాలన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మరొకరికి గాయాలు

చెరుకుపల్లి: ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదవశాత్తూ జాతీయ రహదారిపై డివైడర్‌కు తగిలి ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పొన్నపల్లి గ్రామానికి చెందిన పిట్టు బ్రహ్మరెడ్డి(30), వారే నాగార్జునరెడ్డిలు ద్విచక్ర వాహనంపై చెరుకుపల్లి నుండి పొన్నపల్లి వెళుతున్నారు. ఇంటికి కొద్ది దూరంలోనే ప్రమాదవశాత్తు డివైడర్‌ తగలటంతో బ్రహ్మరెడ్డి తలకు తీవ్ర గాయాలై విపరీతంగా రక్తం పోయింది. నాగార్జునరెడ్డికి గాయాలు కావటంతో వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. బ్రహ్మరెడ్డి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు బ్రహ్మరెడ్డికి ముగ్గురు ఆడ పిల్లలు, భార్య ఉన్నారు. బ్రహ్మరెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

రైలులో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

దాచేపల్లి: రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ రైలులో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వివరాలు.. ఆదివారం రేపల్లె నుంచి సికింద్రాబాద్‌కు రైలు బయలుదేరింది. మొదటి లగేజీ బోగీలో ఇనుపరాడ్‌కి ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రయాణికులు గుర్తించారు. గార్డుకు సమాచారం ఇవ్వటంతో రైలును నడికుడి స్టేషన్‌లో నిలిపివేశారు. ఆర్పీఎఫ్‌, జీఆర్పీ పోలీసులు వెళ్లి పరిశీలన చేయగా దుప్పటితో ఉరేసుకుని వ్యక్తి చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మృతుడిని బాపట్ల జిల్లా చీరాల మండలం చిన్నగంజాంకి చెందిన బాలిగ రాంబాబు(43)గా గుర్తించారు. లారీ క్లీనర్‌గా పని చేసేవాడని తెలిసింది. ఈ నేపథ్యంలో 15 నిమిషాలపాటు రైలును నడికుడి రైల్వేస్టేషన్‌లో ఆపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
గుర్తుతెలియని మృతదేహం లభ్యం 1
1/2

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మృతదేహం లభ్యం 2
2/2

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement