నేటి నుంచి అమలు కానున్న జరిమానాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి అమలు కానున్న జరిమానాలు

Published Sat, Mar 1 2025 8:31 AM | Last Updated on Sat, Mar 1 2025 8:31 AM

-

● లైసెన్స్‌ లేకుండా డ్రైవ్‌ చేస్తే గతంలో రూ.500 జరిమానా విధించేవారు. ఇప్పుడు దాన్ని రూ.5000కు పెంచనున్నారు.

● రెడ్‌లైట్‌ ఉల్లంఘించి వాహనాలు నడిపితే, రూ. 500 జరిమానా పడుతుంది.

● అతివేగం, ర్యాష్‌, స్నేక్‌ డ్రైవింగ్‌లు చేస్తే రూ. 1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తారు.

● రాంగ్‌ రూట్‌లో వాహనాన్ని నడిపితే రూ.5000 ఫైన్‌ విధిస్తారు.

● డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ (మద్యం తాగి వాహనం నడిపితే) గతంలో రూ.2,300 జరిమానా ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ. 10వేలకు పెంచారు. దీంతోపాటు ఒకటి లేదా రెండు రోజుల జైలు శిక్ష కూడా విధించే అవకాశాలు ఉన్నారు.

● రేసింగ్‌, స్పీడ్‌ డ్రైవ్‌ చేస్తే రూ.5 వేలు వసూలు చేయనున్నారు.

● హెల్మెట్‌ ధరించకుండా ద్విచక్ర వాహనం, సీట్‌ బెల్టు ధరించకుండా కార్లు నడిపితే రూ.వెయ్యి కట్టాల్సిందే. దీనికి తోడు మూడు నెలలు లైసెన్స్‌ రద్దు చేస్తారు.

● అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుండా వెళితే రూ. 10వేలు జరిమానా, కేసు కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి.

● ద్విచక్ర వాహనాలపై త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తూ పట్టుబడితే రూ.2 వేల వరకు చలాన్లు రాస్తారు.

● ఇన్సూరెన్స్‌ లేకుండా వాహనాన్ని నడిపితే రూ.2 వేలు జరిమానా చెల్లించాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement