కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు
గుంటూరు వెస్ట్ : ఉమ్మడి కృష్ణా– గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడం సంతోషకరమని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్థానిక ఏసీ కళాశాల స్ట్రాంగ్ రూమ్‌ను శుక్రవారం జేసీ ఏ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలితో కలిసి ఆమె పరిశీలించారు. కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
ఎయిమ్స్‌ను సందర్శించిన ఎంపీ డాక్టర్ పెమ్మసాని
మంగళగిరి : కేంద్ర సహాయ మంత్రి , గుంటూరు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. పలు విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధిపై వైద్యులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులను ప్రత్యేకంగా గుర్తించి వేగంగా వైద్య సేవలందించి పంపించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంత సింగ్ పాల్గొన్నారు.
8న జాతీయ లోక్ అదాలత్
గుంటూరు లీగల్: జిల్లావ్యాప్తంగా అన్ని కోర్ట్ ప్రాంగణాల్లో మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై. వి. ఎస్.బి.జి. పార్థసారథి శుక్రవారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా లోక్ అదాలత్ బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాజీ పడ్డ దగ్గ సివిల్, క్రిమినల్, ఎకై ్సజ్, మోటార్ వాహన ప్రమాద బీమా, చెక్ బౌన్స్, ఎల్‌ఏఓపీ, ప్రీ–లిటిగేషన్ కేసులు పరిష్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు. కేసులు ఎక్కువ పరిష్కరించేలా కక్షిదారులు, పోలీస్ శాఖ సహకరించాలని ఆయన కోరారు.
పదవ తరగతి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
గుంటూరు వెస్ట్: పదవ తరగతి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని పాఠశాలల ప్రాంతీయ సంయుక్త సంచాలకులు బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వేసవి కావడంతో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లా విద్యా శాఖ అధికారి సి.వి.రేణుక మాట్లాడుతూ జిల్లాలో 150 కేంద్రాల్లో 30,460 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు. సమావేశంలో ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ ఎ.వెంకటరెడ్డి, డీసీఈబీ కార్యదర్శి ఎ.తిరుమలేష్, ఉప విద్యా శాఖ అధికారులు ఏసురత్నం, శాంతకుమారి పాల్గొన్నారు.
పలు రైళ్లు రద్దు
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కడియం–ద్వారపూడి–అనపర్తి–విజయవాడ డివిజన్ పరిధిలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో అటుగా ప్రయాణించే గుంటూరు డివిజన్‌లోని పలు రైళ్లను రద్దు చేసినట్లు సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ శుక్రవారం వెల్లడించారు. రైలు నంబర్ (17239) గుంటూరు–విశాఖపట్నం మార్చి 1,2 తేదీలు, (17240) విశాఖపట్నం–గుంటూరు మార్చి 2,3, తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు. (22701) విశాఖపట్నం–గుంటూరు, (22 702) గుంటూరు–విశాఖపట్నం, (12805) విశాఖపట్నం–లింగంపల్లి రైళ్లను మార్చి 2న, (12806) లింగంపల్లి–విశాఖపట్నం రైలును 3న రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.
కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు
కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు
కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment