హోసన్నా.. జయము!
అమరావతి: లక్షలాదిమంది విశ్వాసుల స్తోత్రములతో దైవజనుల ప్రార్థనలతో, ప్రభు ఏసును కీర్తిస్తూ, స్తుతి గీతాలాపనల నడుమ గురువారం రాత్రి 48వ గుడారాల పండుగ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం లేమల్లె గ్రామంలో హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో హోసన్నా దయాక్షేత్రం ప్రాంగణంలోని సువిశాలమైన మైదానంలో గుడారాల పండుగ ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. తొలుత హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహాం మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే గుడారాల పండుగకు ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన విశ్వాసులను ఏసుక్రీస్తు నిరంతరం కాపాడాలని ప్రార్థిస్తున్నామన్నారు. గుడారాల పండుగలో దేవుడు అద్భుత కార్యాలను జరిపిస్తాడన్నారు. రోగులకు స్వస్థత చేకూరాలని అలాగే సేవకులకు ఉజ్జీవం కలగాలని ప్రార్థించారు.
స్తుతి గీతాల ఆల్బమ్ విడుదల..
దక్షిణాఫ్రికాకు చెందిన దైవజనులు పాస్టర్ జాషువా మోజెస్ ప్రత్యేక ప్రార్థనలు చేసి లక్షలాదిమంది విశ్వాసులు సోత్రాలు, కరతాళ ధ్వనుల మధ్య జాతీయపతాకంలోని మూడు రంగుల బెలూన్లను, శ్వేతవర్ణ పావురాలను ఎగురవేసి నాలుగు రోజులపాటు నిర్వహించే గుడారాల పండుగను ప్రారంభించారు. అనంతరం నూతన స్తుతిగీతాల పుస్తకమైన దయాక్షేత్రం పాటల పుస్తకాన్ని అమెరికాకు చెందిన దైవజనులు ఎర్నెట్‌పాల్ ప్రార్థనలు చేసి ఆవిష్కరించారు. అలాగే హోసన్నా స్తుతిగీతాల అల్బమ్‌ను మదనపల్లెకు చెందిన దైవజనులు పాస్టర్ రాజశేఖర్ ప్రార్థనలు చేసి ఆవిష్కరించారు. ప్రార్థనల్లో చైన్నెకి చెందిన దైవజనులు మోహన్. సి. లాజరస్‌తో పాటుగా పాస్టర్లు రమేష్, ఫ్రెడ్డీపాల్, అనీల్, రాజు పాల్గొని స్తుతి గీతాలను ఆలపించారు. తొలిరోజు ప్రార్థనల్లో రెండు తెలుగు రాష్టాల నుంచే కాక దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా విశ్వాసులు తరలివచ్చారు.
పల్నాడు జిల్లా లేమల్లెలో ఘనంగా ప్రారంభమైన 48వ గుడారాల పండుగ ప్రత్యేక ప్రార్థనలు చేసిన హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహాం, చీఫ్ పాస్టర్ జాన్‌వెస్లీ లక్షలాదిగా తరలివచ్చిన విశ్వాసులు
32 ఏళ్ల తర్వాత మళ్లీ లేమల్లెలో..
హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ ఫాస్టర్ జాన్‌వెస్లీ మాట్లాడుతూ గుడారాల పండుగ 1977 నుంచి 1992 వరకు హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ ఏసన్న చేతుల మీదుగా లేమల్లె గ్రామంలో జరిగాయన్నారు. అయితే 1993 నుంచి 2024 వరకు 32సంవత్సరాలపాటు గుంటూరు సమీపంలో గోరంట్లలో నిర్వహించుకున్నామన్నారు. 32 సంవత్సరాల తర్వాత ఇదే లేమల్లె గ్రామంలో మార్చి 5వ తేదీన హోసన్నా దయాక్షేత్ర ఆవరణలో నూతన చర్చి ప్రారంభించు కున్నామన్నారు.
హోసన్నా.. జయము!
హోసన్నా.. జయము!
Comments
Please login to add a commentAdd a comment