ధైర్యం, స్వేచ్ఛతో మహిళా సాధికారత సాధ్యం
నగరంపాలెం: మహిళలు ధైర్యంగా, స్వేచ్ఛగా ఉన్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని జిల్లా ఏఎస్పీ(ఏఆర్) హనుమంతు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం పోలీస్ పరేడ్ మైదానం వద్ద మహిళా సాధికారత ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి మూడు బొమ్మల సెంటర్ మీదగా తిరిగి పోలీస్ పరేడ్ మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఏఎస్పీ మాట్లాడుతూ మహిళలు సమాజంలో ధైర్యంగా, స్వతంత్రంగా ఉండాలని అన్నారు. లింగ సమానత్వాన్ని, హక్కులను స్వేచ్ఛగా అనుభవించినప్పుడే మహిళా సాధికారత సాధించినట్లు అని పేర్కొన్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం ‘మహిళా...మీ కోసం‘ ఇటీవల ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ఆపదలో ఉన్న మహిళలకు అండగా ఉంటుందని అన్నారు. మహిళల రక్షణకు సంబంధించి భద్రతా చర్యలను తీసుకున్నామని పేర్కొన్నారు. ర్యాలీ అనంతరం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందించారు. మహి ళా పీఎస్ డీఎస్పీ సుబ్బారావు, సీఐ నారాయణ, ఆర్‌ఐలు శివరామకృష్ణ, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment