మహిళలు పోరాటాలకు సిద్ధం కావాలి
శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్
నరసరావుపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో అతివలు పోరాటాలకు సిద్ధం కావాలని శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి పిలుపునిచ్చారు. పట్టణంలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శనివారం యూటీఎఫ్, సీఐటీయూ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు ఎ.భాగేశ్వరిదేవి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో శివకుమారి మాట్లాడుతూ.. మహిళా సాధికారత గురించి పాలకుల ఉపన్యాసాల్లో తప్ప ఆచరణలో ఏమీ లేదన్నారు. కనీస రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీరుతో మహిళా సాధికారత వెనుకబడిందన్నారు. సమాన పనికి సమాన వేతనం అందడం లేదని, స్థిరమైన ఉపాధి లభించడం లేదన్నారు. సమాన అవకాశాలు మహిళలకు దూరంగా ఉన్నాయన్నారు. అంగన్వాడీ, ఆశా, మున్సిపల్, భవన నిర్మాణ, ఇతర రంగాలలో వేలాదిమంది మహిళలు మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటుపల్లి రజిని, సంఘం సీనియర్ నాయకులు గద్దె ఉమశ్రీ, నాయకులు ఎస్.దుర్గా బాయి, నాగమ్మ బాయి, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment