డ్రోన్ నిఘాతో మందు బాబులపై కేసులు
పెదకాకాని: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ టీపీ నారాయణస్వామి శనివారం తెలిపారు. వివరాలు.. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు మద్యం తాగుతున్న వారిని గుర్తించేందుకు డ్రోన్ నిఘా ఉంచారు. గ్రామ శివారులోని పొలాల్లో, చెట్ల కింద మద్యం తాగుతున్న వారు సులువుగా దొరికిపోతున్నారు. డ్రోన్ కెమెరా ద్వారా ఏ ప్రాంతంలో ఓపెన్‌గా మద్యం తాగుతున్నారో ఆ ప్రాంతానికి పోలీసు సిబ్బంది చేరుకుని వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై కేసులు నమోదు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
డ్రోన్ నిఘాతో మందు బాబులపై కేసులు
Comments
Please login to add a commentAdd a comment