విజయం సాధించాలంటే కష్టపడి చదవాలి
అర్జున అవార్డు గ్రహీత ఇషా సింగ్
తాడికొండ: విద్యార్థులు జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడి చదవాలని, తక్కువ మార్కులు వచ్చాయని బాధపడకుండా లక్ష్యాలను నిర్దేశించుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని అర్జున అవార్డు గ్రహీత(షూటింగ్) ఇషా సింగ్ అన్నారు. విటోపియా– 2025 వార్షిక క్రీడల, సాంస్కృతిక ఉత్సవం రెండోరోజు శనివారం ఉత్సాహంగా కొనసాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అర్జున అవార్డు గ్రహీత ఇషాసింగ్ పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేసి, వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. వీఐటీ– ఏపీ విశ్వ విద్యాలయం వీసీ డాక్టర్ ఎస్‌వీ కోటారెడ్డి మాట్లాడుతూ మహిళలకు తమ వర్సిటీ అడ్మిషన్లలో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. 2017లో వీఐటీ– ఏపీ క్యాంపస్‌లో కేవలం 8 శాతం మహిళా విద్యార్థులతో ప్రారంభమై ఇప్పుడు 33 శాతానికి పెరిగిందని త్వరలో అది 50 శాతానికి చేరుకుంటుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. రెండో రోజు వార్షిక క్రీడలు, సాంస్కృతిక ఉత్సవంలో భాగంగా ప్రో షోలో ప్రముఖ నేపథ్య గాయని షల్మాలి ఖోల్గాడే, ప్రముఖ నేపథ్య గాయకుడు కార్తీక్‌ల డీజేల సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది. వీఐటీ– ఏపీ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, విటోపియా కన్వీనర్ డాక్టర్ కృష్ణ స్వామి, స్టూడెంట్ వెల్ఫేర్ డీడీ డాక్టర్ ఖాదీర్ బాషా పాల్గొన్నారు.
మారథాన్‌ను ప్రారంభించిన గుంటూరు ఎస్పీ
విటోపియాలో భాగంగా డ్రగ్స్ రహిత ఇండియా కోసం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించారు. వీఐటీ– ఏపీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవీ సెల్వంతో కలసి డ్రగ్స్ రహిత ఇండియా కోసం విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీ విజయవంతమైంది. అనంతరం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విద్యార్థులతో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం డ్రగ్ నిర్మూలనా ప్రతిజ్ఞ చేయించారు.
డాక్టర్ షమ సుల్తానాకు
ఉత్తమ మహిళ అవార్డు
గుంటూరు మెడికల్: గుంటూరుకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్, హోప్ విన్ హాస్పిటల్ చైర్‌పర్సన్ డాక్టర్ షమ సుల్తానాకు ముంబాయికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆఫీస్ ఉత్తమ మహిళ అవార్డు అందజేశారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబాయిలోని యూనియన్ కార్యాలయంలో ఎం పవర్ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో డాక్టర్ షమ సుల్తానా పాల్గొని తన జీవిత కథ వివరించారు. అత్యున్నత స్థాయికి ఎదగడంలో తాను అనుభవించిన సమస్యలను వివరించారు. ఈసందర్భంగా డాక్టర్ షమ సుల్తానాకు ఉత్తమ మహిళఅవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. హోప్ విన్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మహిళల కోసం చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఆమె వివరించారు.
రైల్వే డివిజన్ ఆస్పత్రిలో..
లక్ష్మీపురం:అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు రైల్వే డివిజన్ రైల్వే ఆస్పత్రి ప్రాంగణంలో మహిళా ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని సౌత్ సెంట్రల్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజనేషన్ అధ్యక్షురాలు, డీఆర్‌ఎం సతీమణి ఎం.ఆశాలత అన్నారు. స్థానిక గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద గల రైల్వే ఆస్పత్రిలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని మహిళా రైల్వే ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిందిగా కోరారు. ఇలాంటి శిబిరాల వల్ల ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు. అనంతరం రైల్వే ఆస్పత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. డాక్టర్ ఎ.ప్రియాంక, పి.షర్మిల, డాక్టర్ వి.సింధు, సౌమ్య పాల్గొన్నారు.
మహిళా భాగస్వామ్యం పెరగాలి..
గుంటూరు ఎడ్యుకేషన్: న్యాయ వ్యవస్థలో మహిళా భాగస్వామ్యం మరింతగా పెరగాలని మహిళా, శిశు సంక్షేమశాఖ న్యాయవాది ఎ.విజయలక్ష్మి పేర్కొన్నారు. శ్యామలానగర్‌లోని మాంటిస్సోరి ఇంగ్లిష్ మీడియం స్కూల్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ప్రముఖ వైద్యురాలు కె. శ్రీవిద్య మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఎంతో మంది మహిళలు మన దేశానికి చెందిన వారు కావడం గర్వకారణమన్నారు. పాఠశాల కరస్పాండెంట్ మంజు సెబాస్టియన్ మాట్లాడుతూ మన దేశంలోని మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతస్థాయిలో రాణిస్తూ, తమ శక్తి, సామర్‌ాధ్యలను ప్రపంచానికి చాటి చెప్పడం గొప్ప విషయమన్నారు. మహిళల విజయగాథలు సాధారణ మహిళలకు స్ఫూర్తిదాయకం కావాలని చెప్పారు. ఈసందర్భంగా మంజు సెబాస్టియన్‌తో పాటు అతిథులుగా పాల్గొన్న మహిళా ప్రముఖులనుసత్కరించారు.
విజయం సాధించాలంటే కష్టపడి చదవాలి
విజయం సాధించాలంటే కష్టపడి చదవాలి
విజయం సాధించాలంటే కష్టపడి చదవాలి
Comments
Please login to add a commentAdd a comment