సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన
మంగళగిరి: మండలంలోని నీరుకొండ గ్రామంలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో పలు నిర్మాణాలకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 11వ తేదీన రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు శనివారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ ఎ. భార్గవ్ తేజలు ఆయా ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను, ఎస్‌ఆర్‌ఎం నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో వర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నారాయణరావు, మంగళగిరి తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర, డీఎస్పీ మురళి, రూరల్ సీఐ, ఎస్‌ఐలు వై.శ్రీనివాసరావు, సీహెచ్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment