
లోక్ అదాలత్‌లో 3,027 కేసులు పరిష్కారం
గుంటూరు లీగల్ : ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వై.వి.ఎస్.బి.జి.పార్థసారథి నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్‌లో వివిధ న్యాయ స్థానాల్లో పెండింగ్ ఉన్న, రాజీ పడదగిన కేసులు పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. సివిల్ 388, క్రిమినల్ 2531, ప్రీ లిటిగేషన్ 108 కేసులు కలిపి మొత్తం 3,027 కేసులు పరిష్కరించామని వెల్లడించారు. మొత్తం రూ. 11.49 కోట్ల విలువైన పరిహారం ఇప్పించామని చెప్పారు. జాతీయ లోక్ అదాలత్‌ను ఫిజికల్, వర్చువల్ పద్ధతిలో నిర్వహించినట్లు తెలిపారు. సహకరించిన న్యాయవాదులకు, పోలీస్ సిబ్బందికి, ప్రభుత్వ సంస్థలకు, కక్షిదారులకు, న్యాయస్థాన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment