ఎస్‌టీపీ ప్లాంట్ పరిశీలన
తెనాలిఅర్బన్: తెనాలి పూలే కాలనీలో ట్రైయిల్ రన్ నిర్వహిస్తున్న ఎస్‌టీపీ ప్లాంట్‌ను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పబ్లిక్ హెల్త్ రాష్ట్ర చీఫ్ ఇంజినీర్ మరియన్న పేర్కొన్నారు. శనివారం ఎస్‌టీపీ ప్లాంట్‌ను పరిశీలించి నిర్మాణాలపై ఆరా తీశారు. మిగిలిన చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేయాలని, గ్రీనరీని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే సచివాలయాల పరిధిలోని ఇమ్యూనిటీ సెక్రటరీలకు ఎస్‌టీపీ పనితీరుపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి పూలే కాలనీలో సుమారు రూ.30 కోట్లతో ఎస్‌టీపీ ప్లాంట్ నిర్మించడం జరిగిందన్నారు. దాదాపు పనులు పూర్తయ్యాయని, కొద్ది రోజులుగా ట్రైయిల్ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్వరలో రాష్ట్ర మంత్రులతో దీనిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ శ్రీనివాసరావు, డీఈ శివరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఇన్‌చార్జి ఎంఈ ఆకుల శ్రీనివాసరావు, డీఈలు సుబ్బారావులు, శ్రీనివాసరావు, ఏఈలు ఫణీ, సూరిబాబు, సునీల్ ఉన్నారు.
జిల్లా కోర్టులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం న్యాయ సేవా సదన్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఐదో అదనపు జిల్లా న్యాయమూర్తి కె.నీలిమ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ సమాజంలో సీ్త్ర శక్తి ఎంతో విలువైనదని చెప్పారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని సూచించారు. జిల్లా న్యాయ సేవా సదన్ సెక్రెటరీ, న్యాయమూర్తి సయ్యద్ జియా ఉద్దీన్ మాట్లాడుతూ సమాజంలో మహిళా విద్యకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. స్వేచ్ఛ భద్రతను కల్పించి ముందుకు నడిపించాలన్నారు.
చెట్టుకు వేలాడిన కళేబరం
●కొంత కాలం కిందట వ్యక్తి ఆత్మహత్య
●అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు
బల్లికురవ:గుర్తు తెలియని వ్యక్తి ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడగా శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. మండలంలోని పాతమల్లాయపాలెం గ్రామం నుంచి సోమవరప్పాడు వెళ్లే దారిలో ఉన్న కొండ సమీపంలో వేపచెట్టుకు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన జరిగి చాలా రోజులు కావటంతో శవం.. కళేబరంగా మారింది. శనివారం పాఠశాలలకు సెలవు కావటంతో ఆడుకునేందుకు అటువైపు వెళ్లిన విద్యార్థులు చెట్టుకు వేళ్లాడుతున్న కళేబరం గుర్తించగా.. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జీవీ చౌదరి, రైటర్ ఆంజనేయులు, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఎస్‌టీపీ ప్లాంట్ పరిశీలన
ఎస్‌టీపీ ప్లాంట్ పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment