
రాజాధిరాజ వాహనంపై నారసింహుడు
మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం స్వామి వారు రాజాధిరాజ వాహనంపై దర్శనంఇచ్చారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికలో భక్తి గీతాలు, కూచిపూడి నృత్యం తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో రామకోటిరెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించగా.. కై ంకర్యపరులుగా
దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన పెమ్మసాని శైలేంద్ర వ్యవహరించారు. స్వామి ఆదివారం రాత్రి యాలివాహనంపై దర్శనమివ్వనున్నారు.
– మంగళగిరి/ మంగళగిరి టౌన్
Comments
Please login to add a commentAdd a comment