
మహిళ కిడ్నాప్ కలకలం
లక్ష్మీపురం: మహిళను కిడ్నాప్ చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరాలు ప్రాంతానికి చెందిన యక్కల బాలశేఖర్, వాసవి దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. నగరాలులో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2019లో ముత్యాలరెడ్డినగర్ ప్రాంతానికి చెందిన నరసారెడ్డి అనే వ్యక్తి వద్ద బాలశేఖర్ రూ.2 లక్షల చీటీలు రెండు వేశాడు. రెండూ పాడుకున్నాడు. 2020లో కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయని విజయవాడ ప్రకాష్‌నగర్‌కు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం శారదాకాలనీకి చెందిన వాసవి సోదరుడు రాజేష్ మృతి చెందాడు. మృతదేహాన్ని చూసేందుకు వాసవి వచ్చింది. సమాచారం తెలుసుకున్న నరసారెడ్డి ఆటోలో ఆమెను బలవంతంగా ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌కు వెళదామంటూ ముత్యాలరెడ్డి నగర్‌లోని నరసారెడ్డి తల్లి ఇంట్లో నిర్బంధించాడు. భార్యను వదిలి పెట్టాలంటే బాకీ డబ్బు చెల్లించాలంటూ బాలశేఖర్‌ను నరసారెడ్డి బెదిరించాడు. దిక్కుతోచక విషయాన్ని బాధితుడు తన మరదలికి తెలియజేశాడు. అంత డబ్బు లేదని నరసారెడ్డిని ప్రాధేయపడ్డాడు. కనీసం రూ.లక్ష చెల్లించనదే వదిలి పెట్టనని నరసారెడ్డి చెప్పాడు. లక్ష్మి రూ.లక్ష నగదును నరసారెడ్డికి ఆన్‌లైన్ ద్వారా జమ చేసింది. వాసవిని వదిలి పెట్టాల్సిందిగా కోరితే.. మిగిలిన నగదు చెల్లించేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి బెదిరించాడు. దీంతో బాధితుడు బాలశేఖర్ శనివారం సాయంత్రం అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటికే స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వీరాస్వామి, సిబ్బందితో వెళ్లి నరసారెడ్డిని, వాసవిని స్టేషన్‌కు తీసుకొచ్చారు.
సోదరుడి మృతదేహాన్ని
చూసేందుకు రాక
చీటీల డబ్బులు చెల్లించాలంటూ
బలవంతంగా తరలింపు
Comments
Please login to add a commentAdd a comment