ప్రార్థనతోనే దేవుడి అనుగ్రహం | - | Sakshi
Sakshi News home page

ప్రార్థనతోనే దేవుడి అనుగ్రహం

Published Mon, Mar 10 2025 10:46 AM | Last Updated on Mon, Mar 10 2025 10:42 AM

ప్రార

ప్రార్థనతోనే దేవుడి అనుగ్రహం

అమరావతి: ప్రభువైన ఏసుక్రీస్తు కృప లోకమంతా నిండి ఉందని, మానవుడు దేవుడిని ఎంతగా ప్రార్థిస్తే అంతగా అనుగ్రహిస్తాడని హోసన్నా మినిస్ట్రీస్‌ చీఫ్‌ పాస్టర్‌ జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని లేమల్లె హోసన్నా దయా క్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్‌ నిర్వహిస్తున్న 48వ గుడారాల పండుగ చివరి రోజు పగటిపూట ముగింపు ప్రార్థనలకు లక్షలాది మంది ఆరాధికులు తరలివచ్చారు. పాస్టర్‌ జాన్‌వెస్లీ ప్రసంగిస్తూ.. జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక భేదం లేకుండా అందరికీ దేవుని కృప ఉంటుందని చెప్పారు. ఆయన్ను స్తుతిస్తూ బలి పీఠం దగ్గరకు ఎవరు వస్తారో వారిపై ప్రత్యేక కృప కనబరుస్తాడని పేర్కొన్నారు. లోకమంతా దేవుని కృపతో నిండి ఉందని, దాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆయన్ను నిరంతరం స్తుతించాలని తెలిపారు. ప్రపంచంలో అందరిపైనా ఆయన వర్షం కురిపించినా ఆత్మీయులపై మాత్రం కృపా వర్షం కురిపిస్తాడని పేర్కొన్నారు. హోసన్నా మినిస్ట్రీస్‌ అధ్యక్షుడు పాస్టర్‌ అబ్రహాం ప్రసంగిస్తూ.. గుడారాల పండుగలో దేవుడిని దర్శించిన ప్రతి ఒక్కరి వెంట ఆయన వస్తున్నాడని.. మంచిని కలుగచేస్తాడని తెలిపారు. మానవుడిని ఆశ్రయించే దురాత్మలను దేవుడు దూరం చేసి సంతోషం కలుగ చేస్తాడని వివరించారు. ఎంతో దూరం నుంచి వచ్చిన లక్షలాది మంది విశ్వాసులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించకపోయినా, సర్దుకుపోయిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తొలి సంవత్సర అనుభవాలతో వచ్చే ఏడాది ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 5,6,7,8 వ తేదీల్లో గుడారాల పండుగ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ పండుగ ఘనంగా జరగడానికి సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు, సిబ్బందికి హోసన్నా మినిస్ట్రీస్‌ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పాస్టర్ల బృందం స్తుతి గీతాలు ఆలపించింది. ఆదివారం కావడంతో లక్షలాది మంది హోసన్నా ఆరాధికులు పాల్గొన్నారు.

ముగిసిన 48వ గుడారాల పండుగ ముగింపు ప్రార్థనలు చేసిన పాస్టర్స్‌ జాన్‌వెస్లీ, అబ్రహాం దయా క్షేత్రానికి చేరుకున్న లక్షలాది మంది విశ్వాసులు

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రార్థనతోనే దేవుడి అనుగ్రహం1
1/2

ప్రార్థనతోనే దేవుడి అనుగ్రహం

ప్రార్థనతోనే దేవుడి అనుగ్రహం2
2/2

ప్రార్థనతోనే దేవుడి అనుగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement