గుంటూరుకు 100 ఎలక్ట్రిక్‌ బస్సులు | - | Sakshi
Sakshi News home page

గుంటూరుకు 100 ఎలక్ట్రిక్‌ బస్సులు

Published Mon, Mar 10 2025 10:46 AM | Last Updated on Mon, Mar 10 2025 10:42 AM

గుంటూ

గుంటూరుకు 100 ఎలక్ట్రిక్‌ బస్సులు

కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని

నెహ్రూనగర్‌: కేంద్ర ప్రభుత్వం గుంటూరు పట్టణానికి 100 ఎలక్ట్రిక్‌ బస్సులు కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణ, ఛార్జింగ్‌ పాయింట్లు తదితర ఏర్పాట్ల కోసం ఆదివారం తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌, ఆర్టీసీ అధికారులతో కలిసి ఆయన గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ బస్సులను ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 200 కిలోమీటర్లు వరకు ప్రయాణించగలవన్నారు. వీటిని నిర్వహించాలంటే ప్రత్యేక సదుపాయాలు కావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్‌ 20 ఎకరాల విస్తీర్ణంలో ఉందని గుర్తుచేశారు. బస్టాండ్‌, ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణకుపోను మిగిలిన స్థలంలో పీపీపీ పద్ధతిలో లీజులకు ఆర్టీసీ స్థలాలను ఇస్తే సంస్థకు ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొనకళ్ల నారాయణ, ఈడీ అడ్మిన్‌ జి. రవివర్మ, ఈడీ జోన్‌ 3 నెల్లూరు నాగేంద్రప్రసాద్‌, ఆర్‌ఎం ఎం.రవికాంత్‌, డిపో మేనేజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీనివాస కల్యాణ వేడుక ఏర్పాట్లు పరిశీలన

వెంకటపాలెం (తాడికొండ): తుళ్ళూరు మండలం వెంకటపాలెం గ్రామంలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 15వ తేదీన జరగనున్న శ్రీనివాస కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్‌ పరిశీలించారు. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో ఆదివారం ఆయన ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలను పరిశీలించారు. ఆలయం వద్ద వాహనాల పార్కింగ్‌, రాకపోకలకు అనువుగా కేటాయించిన మార్గాలు, వీవీఐపీ, వీఐపీ భక్తులకు ప్రత్యేక మార్గాల కేటాయింపు తదితర అంశాలపై సిబ్బందితో ఎస్పీ చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. ఎక్కడా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట లా అండ్‌ ఆర్డర్‌ అదనపు ఎస్పీ రవికుమార్‌, తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ, తుళ్ళూరు సీఐలు వెంకటేశ్వర్లు, అంజయ్య తదితరులు ఉన్నారు.

అవయదానంతో

ముగ్గురికి కొత్త జీవితం

గుంటూరు మెడికల్‌: ఓ మహిళ అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేయడానికి అంగీకరించడంతో ముగ్గురికి నూతన జీవితం లభించింది. వివరాలు.. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం వివేకానంద నగర్‌ కాలనీకి చెందిన కొపనాతి వరలక్ష్మి (45) మెదడు సంబంధిత వ్యాధితో ఈ నెల 6 న గుంటూరులోని ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్‌లో చేరారు. ఆదివారం బ్రెయిన్‌ డెడ్‌ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ జీవన్‌ దాన్‌ ప్రతినిధులు వరలక్ష్మి కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. అవయవాలు దానం చేసేందుకు వారు అంగీకరించారు. దీంతో జీవన్మరణ స్థితిలో ఉన్న ముగ్గురికి కొత్త జీవితం ప్రసాదించారు. జీవన్‌ దాన్‌ ప్రతినిధులు ఊపిరితిత్తులను తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిమ్స్‌ ఆసుపత్రికి, కిడ్నీ, లివర్‌లను ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్‌కు అందించారు. ఊపిరితిత్తులను గ్రీన్‌ చానల్‌ ద్వారా గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌కు తరలించారు. ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మమత రాయపాటి, క్లస్టర్‌ మార్కెటింగ్‌ హెడ్‌ డాక్టర్‌ కార్తిక్‌ చౌదరి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
గుంటూరుకు   100 ఎలక్ట్రిక్‌ బస్సులు 1
1/2

గుంటూరుకు 100 ఎలక్ట్రిక్‌ బస్సులు

గుంటూరుకు   100 ఎలక్ట్రిక్‌ బస్సులు 2
2/2

గుంటూరుకు 100 ఎలక్ట్రిక్‌ బస్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement