గుంటూరు
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025
పోలీసుల అదుపులో కీలక సూత్రధారులు
అంగట్లో విద్య..
విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు యూనివర్సిటీ వేదిక కావాలి. విలువలు పెంచేలా వ్యవహరించాలి. కానీ ఆచార్య నాగార్జున వర్సిటీ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ చోటు చేసుకుంటున్న అక్రమాల దందాను పరిశీలిస్తుంటే ఇది విద్యాలయమా, మాఫియా నిలయమా అనే సందేహం నెలకొంటోంది. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నియోజకవర్గంలోని ఈ ఉన్నత విద్యాసంస్థలో రోజుకో అక్రమం చోటుచేసుకుంటున్న తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
ఇఫ్తార్ సహర్
(సోమ) (మంగళ)
గుంటూరు 6.22 5.03
నరసరావుపేట 6.24 5.05
బాపట్ల 6.22 5.03
పెదకాకాని: పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసులు 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నా అసలు సూత్రధారులపై చర్యలు ఉంటాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పరీక్షలలో ఇది సర్వసాధారణమని, నగదు కోసం పలు సెంటర్ల నిర్వాహకులు సిఫార్సులు చేసి మరీ పరీక్షల నిర్వహణకు అనుమతులు తెచ్చుకుంటున్నారని విచారణలో పోలీసులు గుర్తించారు. ఆ తరువాత నిబంధనలకు నీళ్లు వదలడం సర్వసాధారణంగా మారుతోందని వెల్లడైంది. యథేచ్ఛగా మాస్ కాపీయింగ్‌తోపాటు పరీక్ష హాలులోకి పుస్తకాలను కూడా అనుమతిస్తారని పోలీసులు గుర్తించారు. రేయింబవళ్లు కష్టపడి చదువుకుని నిజాయతీగా పరీక్షలు రాసే విద్యార్థుల జీవితాలతో వీరు చెలగాటం ఆడుతున్నారు. బీఈడీ పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారంలో శనివారం తెల్లవారుజామున తెనాలిలో ఒడిశాకు చెందిన ధీరేన్ కుమార్ సాహు, గణేష్ సీహెచ్ సాహు, మిలాన్ ప్రుస్తీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి విదితమే. వారు ఇచ్చిన సమాచారం మేరకు శనివారం రాత్రి పెదకాకాని సీఐ టి.పి. నారాయణస్వామి తమ సిబ్బందితో వినుకొండ చేరుకున్నారు. వివేకానంద బీఈడీ కళాశాల కరస్పాండెంట్ ఎస్ రఫీ, ప్రిన్సిపల్ సురేష్‌కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ దారా స్వర్ణరాజులను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో ఒడిశాకు చెందిన ఏజెంట్లు సంతోష్ సాహు, బిష్ణుపాత్రో, పురుషోత్తమ్ ప్రధాన్, సుదాన్ష్ శేఖర్ రాణా, బదాల్ ప్రధాన్ తదితరులను అదుపులోకి తీసుకుని ఆదివారం స్టేషన్‌కు తరలించారు. కేసులో మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.
7
బీఈడీ పరీక్ష పత్రం లీకేజీలో తీగ లాగితే కదులుతున్న డొంక రెండు రోజుల్లో 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వినుకొండ కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్, కంప్యూటర్ ఆపరేటర్‌లది కీలక పాత్రగా గుర్తింపు
న్యూస్‌రీల్
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment