డీ అడిక్షన్ సెంటర్ పరిశీలన
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): మద్యానికి బానిసైన వారికి డీ అడిక్షన్ సెంటర్లో కౌన్సెలింగ్ ఇచ్చి మద్యపానానికి దూరం చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ డాక్టర్లకు సూచించారు. బుధవారం గుంటూరు జీజీహెచ్‌లోని డీ అడిక్షన్ సెంటర్, గుంటూరు ఎకై ్సజ్ కార్యాలయంలోని లేబొరేటరీని ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిశాంత్ కుమార్ మాట్లాడుతూ మద్యానికి బానిసైన వారికి క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పారు. అనంతరం లేబొరేటరీని సందర్శించి రోజూ ఎన్ని నమూనాలు తీస్తున్నారని ఆరా తీశారు. కార్యక్రమంలో గుంటూరు ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, గుంటూరు ఎకై ్సజ్ శాఖ అధికారి అరుణ కుమారి, ఏఈఎస్ మారయ్య బాబు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment