ముగిసిన ఏఎన్‌యూ అంతర కళాశాలల సాఫ్ట్‌బాల్ టోర్నీ
గుంటూరు రూరల్: క్రీడలతో శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక దృఢత్వం సిద్ధిస్తుందని ఆర్‌వీఆర్‌జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్. శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్ మద్దినేనిలు తెలిపారు. రెండు రోజులుగా చౌడవరం గ్రామంలోని ఆర్‌వీఆర్‌జేసీ కళాశాలలో జరుగుతున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల సాఫ్ట్ బాల్ (మెన్) టోర్నమెంట్ పోటీలు బుధవారంతో ముగిశాయి. పోటాపోటీగా సాగిన టోర్నమెంట్‌లో ధనలక్ష్మి కాలేజీ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు మొదటి స్థానంలో నిలిచి విన్నర్ ట్రోఫీని కై వసం చేసుకుంది. ఎమ్‌ఎల్‌ఎస్ డిగ్రీ కాలేజీ జట్టు రెండొవ స్థానంలో నిలిచి రన్నర్ ట్రోఫీని సాధించింది. తృతీయ స్థానంలో ఏఎన్‌యూ ఫిజికల్ కళాశాల జట్టు నిలవగా, నాలుగవ స్థానంలో ఆర్‌వీఆర్‌జేసీ జట్టు నిలిచింది. విజేతలకు ట్రోఫీలను అందజేశారు. టోర్నమెంట్‌లో మెలకువలతో తమ ఉత్తమ నైపుణ్యాన్ని కనబరిచిన క్రీడాకారులతో ఏఎన్‌యూ సాఫ్ట్ బాల్ (మెన్) జట్టును సెలక్షన్ కమిటీ సభ్యులు నిర్ణయించారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఆర్ గోపాలకృష్ణ, ట్రజరర్ డాక్టర్ కె కృష్ణప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీనివాస్, డైరెక్టర్ డాక్టర్ కె రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, పీడీలు డాక్టర్ పీ గౌరీశంకర్, డాక్టర్ ఎమ్ శివరామకృష్ణ, ఏఎన్‌యూ టోర్నమెంట్ ఆబ్సర్వర్ డాక్టర్ సూర్యనారాయణ, ఏఎన్‌యూ సెలెక్షన్ కమిటీ మెంబర్స్ డాక్టర్ పీ శ్రీనివాస్, డాక్టర్ ఎం.బుచ్చిబాబు, డాక్టర్ రాజామెరిసిన్‌బాబు, జే ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
విన్నర్ ట్రోఫీని కై వసం చేసుకున్న
ధనలక్ష్మి కాలేజీ జట్టు
Comments
Please login to add a commentAdd a comment