24న శాంతియుత నిరసన
గుంటూరు మెడికల్: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో దీర్ఘకాలంగా ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం మార్చి 24న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శాంతియుత నిరసన తెలియజేయనున్నట్లు ఎన్టీఆర్ వైద్య మిత్ర అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుజాత, జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరులోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త (డీసీ) ఆఫీసుల వద్ద విధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈనెల 27న మంగళగిరిలోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆఫీస్ వద్ద గాంధేయ పద్ధతిలో శాంతియుత నిరసన తెలుపుతామని వెల్లడించారు. ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్ట్ అండ్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు.
ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిద్దాం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి
డాక్టర్ విజయలక్ష్మి
తెనాలిఅర్బన్: ప్రతి శుక్రవారాన్ని డ్రైడేగా పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ కొర్ర విజయలక్ష్మి సూచించారు. మలేరియా విభాగం ఆధ్వర్యంలో నరేంద్రదేవ్ కాలనీలో శుక్రవారం దోమలపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దోమల నివారణ గురించి వివరించారు. జిల్లా మలేరియా అధికారి తలాటం మురళీకృష్ణ సుబ్బరాయణం మాట్లాడుతూ జ్వర లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స పొందాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment