మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025
దర్యాప్తుకు నాలుగు ప్రత్యేక బృందాలు
● అనుమానితులను ప్రశ్నిస్తున్న పోలీసులు
● మృతురాలి మాజీ ప్రియుడిపైనా అనుమానం
ఇఫ్తార్ సహర్
(మంగళ) (బుధ)
గుంటూరు 6.25 4.52
బాపట్ల 6.25 4.52
నరసరావుపేట 6.27 4.54
తాడేపల్లి రూరల్: డీజీపీ కార్యాలయ సమీపంలో ఆదివారం జరిగిన మహిళ హత్య కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సతీష్‌కుమార్ విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ సతీష్‌కుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ సుప్రజ, డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. విజయవాడకు చెందిన సీసీఎస్ పోలీసులు విజయవాడలో కూడా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
మృతురాలు పామర్రు వాసి
మృతురాలు కృష్ణాజిల్లా పామర్రు గ్రామానికి చెందిన సజ్జ లక్ష్మి తిరుపతమ్మ (32)గా పోలీసులు గుర్తించారు. ఈమె భర్త నవీన్ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి శీలం ఝాన్సీ వద్ద పిల్లలిద్దరినీ ఉంచింది. విజయవాడలో వంటపని చేస్తున్నానని తల్లికి చెబుతూ వస్తోంది. విజయవాడలోని కృష్ణలంకలో ఉంటోంది. ఏడాది క్రితం ట్రాన్స్‌జెండర్ జెస్సీ పరిచయమైంది. ఆమె లక్ష్మీతిరుపతమ్మను వ్యభిచార వృత్తిలోకి దించినట్టు సమాచారం. ఆ తర్వాత మరో ట్రాన్స్‌జెండర్ నజీరతోనూ పరిచయమైంది. వీరిద్వారా తిరుమపత్మ మాజీ ప్రియుడు రాధారంగా నగర్‌కు చెందిన చింటూ గురించి పోలీసులు తెలుసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. తిరుపతమ్మ తన ఇద్దరు బిడ్డలను చదివించుకోవడం కోసమే ఈ వృత్తి చేపట్టినట్లు తెలుస్తోంది.
● 45 రోజుల వ్యవధిలో ఇద్దరి మహిళల హతం
● హడావుడిగా హతుల మృతదేహాల తరలింపు●
● ఆధారాల సేకరణలో ఖాకీల విఫలం
● అసహనం వ్యక్తం చేసిన ఎస్పీ సతీష్‌కుమార్
● డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఘటనలు
● రాజధాని ప్రాంతంలో కొట్టొచ్చినట్టు కనిపించిన భద్రతా వైఫల్యం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొలనుకొండలో సాయిబాబా గుడి వెనుక కృష్ణాకెనాల్‌కు వచ్చే జంక్షన్‌లో జనవరి 31న కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని ప్రాథమిక దర్యాప్తు చేయకుండా రాత్రికిరాత్రే పోలీసులు మార్చురీకి తరలించారు. 45 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలూ సేకరించలేదు. తాజాగా ఆదివారం రాత్రి కొలనుకొండ జాతీయ రహదారి పక్కనే జరిగిన లక్ష్మీ తిరుపతమ్మ హత్య కేసులోనూ పోలీసులు ఇలాగే వ్యవహరించారు. రాత్రి 9.30 గంటలకు వచ్చిన పోలీసులు 11 గంటలకల్లా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలం వద్దకు డాగ్ స్క్వాడ్‌ను తీసుకు రావడంలో పోలీసులు విఫలమయ్యారు. తెల్లవారుజామున ఎప్పుడో నాలుగు గంటలకు డాగ్‌స్క్వాడ్ వచ్చింది. అప్పటికే ఘటనా స్థలం వద్ద ఉన్న సిమెంటుతో కూడిన చెప్పులు, కండోమ్స్, హ్యాండ్‌బ్యాగ్, అమెరికన్ క్లబ్ సిగరెట్ పెట్టెలను తీసివేయడంతో డాగ్ స్క్వాడ్ వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. చివరకు ఎస్పీ సతీష్‌కుమార్ వచ్చేంత వరకు కూడా మృతదేహాన్ని ఉంచకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయానికి సమీపంలో వీవీఐపీలు నిత్యం తిరిగే ప్రాంతంలో మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైనా పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది.
గంజాయికి అడ్డా!
కూటమి సర్కారు వచ్చాక తాడేపల్లి ప్రాంతం గంజాయికి అడ్డాగా మారింది. గంజాయి తాగి యువకులు హల్‌చల్ చేస్తున్నారు. మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల నులకపేటలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన ఎస్పీ సతీష్‌కుమార్‌కు మహిళలు వివరించారు. రక్షణ కల్పించాలని వేడుకున్నారు.
ఎవరు చంపి ఉండొచ్చు?
జెస్సీ నజీరాతోపాటు లక్ష్మీతిరుపతమ్మ ఆదివారం రాత్రి కూడా కొలనుకొండ జాతీయ రహదారి వద్దకు వచ్చింది. జెస్సీ విటులను పిలిచి లక్ష్మీతిరుపతమ్మతో పంపేది. ఆదివారం రాత్రి కూడా తొలుత ఇద్దరు విటులు వెళ్లారు. అనంతరం చేతిలో ఒక సంచి పట్టుకుని హిందీలో మాట్లాడే పొట్టిగా నల్లగా ఉన్న వ్యక్తి లక్ష్మి తిరుపతమ్మ వద్దకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చిన తరువాత ముళ్ల పొదల్లో నుంచి తిరుపతమ్మ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన జెస్సీ, నజీర లోపలకు వెళ్లి చూశారు. రక్తపు మడుగులో పడి ఉన్న తిరుపతమ్మ కనిపించింది. దీంతో భయపడిన వారిద్దరూ పెద్దగా కేకలు వేశారు. 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది వచ్చి లక్ష్మీతిరుపతమ్మ మృతి చెందిందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రి 8 గంటలకు ఘటన జరిగితే తాడేపల్లి పోలీసులు రాత్రి 9.30 గంటలకు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో తిరుపతమ్మ మాజీ ప్రియుడు చింటూ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా తిరుపతమ్మ తనను దూరం పెడుతుందని చింటూ కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది.
అనాథలుగా పిల్లలు
లక్ష్మీతిరుపతమ్మ మృతి వార్త తెలుసుకుని ఘటనాస్థలానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లల్ని పోషించుకోవడం కోసం వంట పనికి వస్తుందని భావించామే కానీ ఇలాంటి పనులు చేస్తోందని ఊహించలేదని, ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని గుండెలవిసేలా విలపించారు. పిల్లల సంరక్షణను ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.
ఘటనా స్థలం వద్దకు చేరుకుని పోలీసు సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ సతీష్‌కుమార్
తాడేపల్లి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన మహిళ హత్య కేసులో పూర్తి ఆధారాలు సేకరించకుండా మృతదేహాన్ని ఘటనాస్థలం నుంచి తరలించడంపై జిల్లా ఉన్నతాధికారీ అసహనం వ్యక్తం చేయడం దీనికి బలం చేకూరుస్తోంది. గత 45 రోజుల్లో ఈ ప్రాంతంలో ఇద్దరు మహిళలు హత్యకు గురికావడం, డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో నిత్యం వీవీఐపీలు తిరిగే ప్రాంతంలో ఘటనలు జరగడం, రెండు కేసుల్లోనూ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారడం కూటమి సర్కారు, హోంశాఖ పనితీరును, భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి.
7
న్యూస్‌రీల్
మూడు నెలలుగా వీడియోలు, రీల్స్
హత్య జరిగిన ప్రాంతంలో ఎన్నాళ్లగానో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలూ జరుగుతున్నట్టు సమాచారం. మూడునెలలుగా ఇక్కడే లక్ష్మీతిరుపతమ్మ, మరికొందరు రీల్స్, సెల్ఫీ వీడియోలు చిత్రీకరించినట్టు సమాచారం. డీజీపీ కార్యా లయం సమీపంలో నిత్యం వీవీఐపీలు తిరిగే రహదారిలో భద్రతా వైఫల్యానికి ఇది నిదర్శనంగా ఉంది. తిరుపతమ్మ, ఆమె ప్రియుడు చింటూ, జెస్సీ కొలనుకొండ ప్రాంతంలో దౌర్జన్యం చేస్తూ వ్యభిచార వృత్తిలో ఉన్న ఇతరులను రానీయకుండా విటులను తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటున్నారని, ఇక్కడ వీరి ఆధిపత్యం ఏమిటనే భావనతో ప్రత్యర్థులు ఈ హత్య చేసి ఉంటారా అనే అనుమానమూ వ్యక్తమవుతోంది.
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు