
ప్రయాణికుల సౌఖ్యమే ముఖ్యం
తెనాలిఅర్బన్: బస్టాండ్ ఆవరణలో, బస్సులలో ప్రయాణికుల సౌఖ్యమే ముఖ్యమని ఆర్టీసీ జిల్లా ప్రాంతీయ అధికారి ఎం.రవికాంత్ చెప్పారు. తెనాలి డిపోను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్, గ్యారేజ్‌లను పరిశీలించి సూచనలు చేశారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్‌లు అప్రమత్తంగా ఉండాలన్నారు. మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రయాణికుల సంఖ్య తక్కువ ఉన్న సర్వీసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. బస్టాండ్ ఆవరణలోని మరుగుదొడ్ల నిర్వహణ సరిగ్గా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎం ఎ.రాజశేఖర్, అసిస్టెంట్ డీఎం ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఆర్టీసీ జిల్లా ప్రాంతీయ అధికారి రవికాంత్