కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 1,41,161 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,44,863 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,100 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,300 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 66,873 బస్తాలు నిల్వ ఉన్నట్లు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్
తాడేపల్లి రూరల్: వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర విభాగ ప్రధాన కార్యదర్శిగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ముదిగొండ ప్రకాష్ నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ముదిగొండ ప్రకాష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి తనమీద నమ్మకంతో ఈ పదవిని ఇచ్చారని తెలిపారు. భవిష్యత్తులో వైఎస్సార్ సీపీ బలోపేతం కోసం కృషిచేస్తాననిపేర్కొన్నారు.