తాడేపల్లి రూరల్: ఈనెల 24 నుంచి 30 వరకు తైవాన్‌లో జరిగిన అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో తాడేపల్లి డోలాస్‌నగర్‌కు చెందిన మెరుగుపాల హాశిష్ సత్తాచాటాడు. చైనీస్ తైపి రోలర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో హాశిష్ ఆర్టిస్ట్ స్కేటింగ్ విభాగంలో ఫ్రీ స్టైల్, ఇన్‌లైన్, సోలో డ్యాన్స్ పోటీల్లో తలపడగా మూడు విభాగాల్లో రెండవ స్ధానంలో నిలిచి మూడు రజిత పతకాలు సాధించాడు. తమిళనాడు కోలాచీలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన జాతీయస్ధాయి పోటీల్లోనూ హాశిష్ ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. కోచ్ పి.సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రోలర్స్ స్కేటింగ్ అసోసియేషన్ కార్యదర్శి పి.థామస్, గుంటూరు రోలర్‌స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నీలిమ, శ్రీకాంత్ హాశిష్‌కు అభినందనలు తెలిపారు.