
చికిత్సలన్నీ పూర్తి ఉచితం
జీజీహెచ్ క్యాథ్‌ల్యాబ్‌లో కార్డియాలజీ రోగులకు యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, ఫేస్‌మేకర్ ఇతర అన్ని రకాల గుండె చికిత్సలు పూర్తి ఉచితంగా అందిస్తున్నాం. న్యూరో రేడియాలజీ వైద్యసేవలనూ అందుబాటులోకి తీసుకొచ్చాం. మెదుడు రక్తనాళాల్లో పూడికలు, కాళ్ళ రక్తనాళాల్లో ఏర్పడే పూడికలు తీసివేసి స్టంట్‌లు వేస్తున్నాం.
– డాక్టర్ బొర్రా విజయ్‌చైతన్య,
సీనియర్ ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్, క్యాథ్‌ల్యాబ్ నిర్వాహకులు
కార్డియాలజీ వైద్య విభాగాన్ని అభివృద్ధి చేశాం. ఇటీవల 100కుపైగా గుండె బైపాస్ సర్జరీలు చేసి రికార్డు సృష్టించాం. 25వేలకుపైగా క్యాథ్‌ల్యాబ్ చికిత్సలు పూర్తిచేశాం. అధికారులు, ప్రజాప్రతినిధులు, జింకానా, నాట్కో సంస్థ, ఇతర దాతల సహకారంతో ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నాం.
– డాక్టర్ యశశ్వి రమణ,
జీజీహెచ్ సూపరింటెండెంట్

చికిత్సలన్నీ పూర్తి ఉచితం