
పెన్షన్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
గుంటూరు వెస్ట్: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన పెన్షన్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ జి.పున్నారావు డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్‌లోని పెన్షనర్స్ హోమ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సవరణ జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. పెన్షనర్లకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. ఇటువంటి అంశాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. అనంతరం కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సమావేశంలో జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.హెచ్.వెంకటేశ్వర్లు, ఎం.ఎన్.మూర్తి, టి.శ్రీనివాసరావు, పార్థసారథి పాల్గొన్నారు.