
కూలీల ఆటో బోల్తా.. ఒకరు మృతి
వినుకొండ: మిరపకాయల కూలీల ఆటో తిరబడి ఒకరు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని ఏనుగుపాలెం సమీపంలో జరిగింది. ఉమ్మడివరం నుంచి నూజెండ్ల మండలం త్రిపురాపురం గ్రామానికి మిర్చి కోసేందుకు ప్రతిరోజు కూలీలు వెళ్తూ ఉంటారు. ఉదయం ఏనుగుపాలెం సమీపంలో ఆటో తిరగబడింది. ఈ ప్రమాదంలో జోజమ్మ (60) మృతి చెందింది. మార్తమ్మ, వెంకాయమ్మ, అంకమ్మ, కోటమ్మ, మరియమ్మ, ఆదెమ్మ తదితర ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో వారిని వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
మరో ఏడుగురికి తీవ్రగాయాలు

కూలీల ఆటో బోల్తా.. ఒకరు మృతి

కూలీల ఆటో బోల్తా.. ఒకరు మృతి

కూలీల ఆటో బోల్తా.. ఒకరు మృతి