
దివ్యాంగుల చట్టంలో అనేక వెసులుబాటులున్నాయి
గుంటూరు వెస్ట్: విభిన్న ప్రతిభావంతుల చట్టం–2016లో అనేక వెసులుబాటులున్నాయని వాటిని తెలుసుకోవాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో దివ్యాంగుల ఆస్తిపాస్తుల నిర్వహణ, ఫ్యామిలీ పెన్షన్‌తోపాటు తదితర అంశాలను పర్యవేక్షించేందుకు వీలుగా మందపాటి ఉదయ్ సాగర్, కొత్తపల్లి రవిబాబులను సంరక్షకులుగా నియమిస్తూ గార్డియన్‌షిప్ సర్టిఫికెట్‌ను అందజేశారు. జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్టాన్ని అనుసరించి దివ్యాంగుల ఆస్తిపాస్తుల నిర్వహణ, ఫ్యామిలీ పెన్షన్‌తో పాటు తదితర అంశాలను పర్యవేక్షించేందుకు అవకాశముంటుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ సువార్త పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ్