
రైస్ పుల్లింగ్ పేరుతో మోసం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): రైస్ పుల్లింగ్ పేరుతో కొందరు తమను మోసగించారని భార్యాభర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) నిర్వహించారు. బాధితుల నుంచి ఎస్పీ సతీష్‌కుమార్ అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదిదారుల మొరను ఎస్పీ ఆలకించారు. బాధితులకు చట్ట ప్రకారం న్యాయం చేయాలని డీఎస్పీలు, సీఐలను ఆదేశించారు. జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం), డీఎస్పీలు రమేష్ (ట్రాఫిక్), సుబ్బారావు (మహిళా పీఎస్) కూడా అర్జీలు స్వీకరించారు.
రుణం ఇప్పిస్తానని మోసం
గతేడాది కొత్తపేటకు చెందిన ఓ మహిళ పరిచయమైంది. డ్వాక్రా గ్రూప్ ద్వారా రూ.2 లక్షల రుణం ఇప్పిస్తానని నమ్మబలికింది. పొదుపు ద్వారా రూ.23 వేలు చెల్లించాలని చెప్పగా, రెండు విడతలుగా ఆమెకు చెల్లించా. మరో రూ.2 లక్షలు రుణం ఇప్పిస్తానని చెప్పగా అందుకు మేము నిరాకరించాం. దీతో రూ.2 లక్షల చెక్కు వచ్చిందని కొత్తపేటలో ఉంటున్న తన ఇంటికి తీసుకెళ్లింది. అల్పాహారం భుజించగా, కొద్దిసేపటికి మత్తులోకి జారుకున్నాను. దీంతో నా బంగారు ఉంగరం, చెవి పోగులు తస్కరించింది. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇప్పటి వరకు పట్టించుకున్న పాపానపోలేదు. న్యాయం చేయగలరు.
– సీహెచ్.మంగాదేవీ, వెంకటరమణకాలనీ 2/4వ అడ్డరోడ్డు.
భార్యాభర్తల ఆవేదన పోలీస్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు అర్జీలు స్వీకరించిన ఎస్పీ సతీష్‌కుమార్
రూ.1.47 కోట్లకు టోకరా
తొమ్మిదేళ్ల క్రితం బుచ్చయ్యతోటలో ఉంటున్న ఓ ఫిజియోథెరపిస్ట్ పరిచమయ్యాడు. రైస్ పుల్లింగ్ వ్యాపారం చేస్తున్నట్లు నమ్మించాడు. ముందుగా రూ.40 లక్షలు చెల్లిస్తే రూ.కోట్లల్లో డబ్బులొస్తాయమని నమ్మబలికాడు. ఇప్పటి వరకు సుమారు రూ.1.47 కోట్లను విడతలవారీగా చెల్లించాను. ప్రస్తుతం డబ్బులు అడిగితే సమాధానం చెప్పడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. న్యాయం చేయగలరు.
– జి.ఆంజనేయులు, నాసరమ్మ, భార్యాభర్తలు, చల్లవారిపాలెం, గుంటూరు రూరల్

రైస్ పుల్లింగ్ పేరుతో మోసం