
అంతర్జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో బీఏ (ఐఎఎస్) విభాగం, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమం పోస్టర్‌ను వర్సిటీ వీసీ డాక్టర్ పార్థసారథి వర్మ, బీఏ (ఐఎఎస్) విభాగాధిపతి డాక్టర్ బి. శివనాగయ్యలు మంగళవారం ఆవిష్కరించారు. వీసీ మాట్లాడుతు ఈనెల 10,11 తేదీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. బీఏ విభాగ అధిపతి డాక్టర్ బి.శివనాగయ్య మాట్లాడుతూ ఆధునిక తెలుగు సాహిత్యంలో కథ, కథానిక, గల్పిక, నవల, ఆధునిక కవిత్వం, హైకూలు, నానీలు వంటి ప్రక్రియలు, సీ్త్రవాద, దళిత, మైనార్టీ వాద, ప్రతీక వంటి వాదాలలో ఇప్పటివరకు జరిగిన కృషిని మూల్యాంకనం చేస్తూ భవిష్యత్తు తరాలకు ఈ విషయాలలో ఒక దిశను నిర్దేశించడమే ఈ సదస్సు ముఖ్య లక్ష్యమని అన్నారు. మరిన్ని వివరాల కోసం సహాయ ఆచార్యులు డాక్టర్ కె.ప్రజాపతి 9889941900 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ కె.రాజశేఖరరావు, డాక్టర్ ఎన్.వెంకట్రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, బీఏ (ఐఎఎస్) ఉప విభాగాధిపతి డాక్టర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.