
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
గుంటూరు లీగల్ గుంటూరు జిల్లా కోర్టులో పనిచేసి బదిలీలపై వెళుతున్న జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.జి.బి.పార్థసారథి, లేబర్ కోర్టు కమ్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ చైర్మన్ డి.తిరుమలరావు, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్‌న్స్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫీసు కోర్టు జడ్జి ఎ.అనితలను మంగళవారం ఘనంగా సన్మానించారు. వీడ్కోలు కార్యక్రమానికి గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యంగలశెట్టి శివసూర్యనారాయణ అధ్యక్ష వహించగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయమూ ర్తుల ఉన్నతిని కొనియాడారు. వీరు భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు