
భూ సమస్యల పరిష్కారంలో సర్వే శాఖ పాత్ర కీలకం
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ భార్గవ్ తేజ
గుంటూరు వెస్ట్: భూ సమస్యల పరిష్కారంలో సర్వే శాఖ పాత్ర ఎంతో కీలకమని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ భార్గవ్ తేజ తెలిపారు. జాతీయ సర్వే దినోత్సవంలో భాగంగా ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం భవనంలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ భూమిపై మమకారం ఉంటుందని తెలిపారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 10న జాతీయ సర్వే దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్‌తోపాటు ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, 53 మంది సర్వే శాఖ ఉద్యోగులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఉత్తమ సేవలందించిన సర్వేయర్లకు ఇన్‌చార్జి కలెక్టర్‌తోపాటు ఆర్డీఓ కె.శ్రీనివాసరావు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సీహెచ్. మల్లికార్జునరావు, కార్యదర్శి ఆర్.మల్లికార్జునరావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి.లక్ష్మీనారాయణ, పి.వి. భావన్నారాయణ, సాంబశివరావు పాల్గొన్నారు.