
కృషి చేసిన పూలే
సమాజ అభ్యున్నతి కోసం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): సమాజం కోసం, మహిళల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు మహాత్మా జ్యోతీరావు పూలే అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చెప్పారు. జ్యోతీరావు పూలే జయంత్యుత్సవం సందర్భంగా బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళలకూ సమాంతర హక్కులు ఉండాలని, అంటరానితనం నిర్మూలన కోసం ఆయన ఎంతగానో పాటు పడ్డారన్నారు. ఆయన ఆశయన సాధనే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పాటు పడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతీరావు పూలే అని కొనియాడారు. బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. మహిళలకు విద్య అవసరమని చాటి చెప్పారన్నారు. సమాజంలో అసమానతలు తొలగించేందుకు కృషి చేశారన్నారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ మహిళలు ఇంటికి పరిమితం కాకూడదని, వారికి విద్య అవసరమని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతీరావుపూలే అని కొనియాడారు. మహిళల అభ్యున్నతి ఎంతో కృషి చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు విలువ లేకుండా పోయిందన్నారు. మహిళల పట్ల దుర్భాషలాడడం పరిపాటిగా మారిందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, పార్టీ నేత మేకతోటి దయాసాగర్, పార్టీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, కొత్తా చిన్నపరెడ్డి, బత్తుల దేవ, కొరిటెపాటి ప్రేమ్‌కుమార్, బైరెడ్డి రవీంద్రారెడ్డి, నందేటి రాజేష్, సి.హెచ్.వినోద్, విజయ్, ఈమని రాఘవరెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.