
గుంటూరు
శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సేవలు, మొక్కుబడులు నిలిపివేత
దుగ్గిరాల: కంఠంరాజుకొండూరులోని మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో మే ఒకటి నుంచి ఐదో తేదీ వరకు ఆర్జిత సేవలు, మొక్కుబడులు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ఈఓ కె.సునీల్‌కుమార్ శుక్రవారం తెలిపారు. అమ్మవారి దర్శనం మాత్రమే యథాతథంగా ఉంటుందని, భక్తులు గమనించి సహకరించాలని కోరారు.
ఆలయ నిర్మాణానికి విరాళం
నరసరావుపేటరూరల్: ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన సకిల వెంకటేష్, వెంకటలక్ష్మీ భార్గవి దంపతులు శుక్రవారం రూ.లక్ష విరాళం అందజేశారు.
ముగిసిన సదరం క్యాంప్
తెనాలిఅర్బన్: వికలాంగుల ధ్రువపత్రాల పునఃపరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సదరం క్యాంప్ శుక్రవారంతో ముగిసింది.
9

గుంటూరు

గుంటూరు

గుంటూరు