
కార్డియాలజిస్ట్‌గా ఎదగాలనేది ఆశయం
మా స్వస్థలం కడప.నాన్న వెంగల్‌రెడ్డి వ్యాపారం చేస్తున్నారు. సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాల్లో 415 మార్కులు సాధించాం. వైద్య వృత్తిని చేపట్టి, కార్డియాలజిస్టుగా ఎదగాలనే ఆశయంతో ఇంటర్మీడియెట్ నుంచి గుంటూరులోనే చదువుతున్నాం. ప్రస్తుతం నీట్‌కు సన్నద్ధమవుతున్నా.
–యాగ నాగ శరణ్య,
సీనియర్ ఇంటర్ (బైపీసీ, 989 మార్కులు)
తల్లిదండ్రుల బాటలో..
గుంటూరుకు సమీపంలోని గోరంట్లలోని అన్నపూర్ణనగర్ మా స్వస్థలం. నాన్న ఇంద్రప్రసాద్ అమరావతి హాస్పిటల్స్‌లో ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు. అమ్మ స్రవంతి సెయింట్ జోసఫ్ ఆస్పత్రిలో వైద్యురాలు. మా కుటుంబంలో ఎక్కువ మంది డాక్డర్లే. అమ్మానాన్న బాటలో వైద్య వృత్తి చేపట్టేందుకు నీట్‌కు సన్నద్ధమవుతున్నా. కళాశాలలో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నా.
–గాధంశెట్టి హాసిని,
సీనియర్ ఇంటర్ (బైపీసీ, 989 మార్కులు)
మాది తెనాలిలోని బీసీ కాలనీ. స్థానిక వివేక మహిళా జూనియర్ కాలేజిలో చదువుతున్నా. మా నాన్న షేక్ సుభాని కార్పెంటర్. తల్లి జమీలా. ఇద్దరూ వెన్నంటి ఉండి నా చదువుకు ఎంతగానో ప్రోత్సహించారు. ఇక కాలే.ఈ యాజమాన్యం, అధ్యాపకుల తోడ్పాటు మరువలేనిది. అందుకే రాష్ట్రస్థాయి ఫలితాన్ని సాధించాను. ఐఏఎస్ అధికారిని కావాలని నేను చిన్నతనంనుంచీ కలలు కంటున్నా. ఆ లక్ష్యంతోనే చదువుతున్నా. ఇలాగే కొనసాగిస్తాను.
– షేక్ ఫరీదా, తెనాలి సీనియర్ ఇంటర్ (ఎంపీసీ 989/1000 మార్కులు)

కార్డియాలజిస్ట్‌గా ఎదగాలనేది ఆశయం

కార్డియాలజిస్ట్‌గా ఎదగాలనేది ఆశయం