
అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఎండ తీవ్రత దృష్ట్యా మే నెల అంతా అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలని, మినీ అంగన్‌వాడీ టీచర్లందరికీ మెయిన్ అంగన్‌వాడీ టీచర్లుగా ఉద్యోగోన్నతి కల్పించాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒ.లలిత, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్.సారమ్మ కోరారు. ఈ మేరకు గురువారం స్థానిక అమరావతి రోడ్డులోని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అంగన్‌వాడీల సమస్యలను విన్నవించారు. వృత్తిపరమైన ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు వాణిశ్రీ, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొంటున్నట్టు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు నోటీసు కూడా కమిషనర్‌కు అందించినట్టు వివరించారు. సమస్యలపై కమిషనర్ సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు.
ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రతినిధుల వినతి