
ఉగ్రవాదుల దాడి హే యం
పట్నంబజారు: జమ్మూకాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దుర్ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నేతృత్వంలో బుధవారం పార్టీ శ్రేణులు శాంతి ర్యాలీ చేపట్టాయి. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి బుధవారం ఎన్టీఆర్ స్టేడియం సమీపంలోని సిగ్నల్స్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సరైన బదులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ విచక్షణరహితంగా పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి హేయమన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఉగ్రవాద సంస్థలను అణచివేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఇలాంటి దాడులు చేయడం ఎంతో హేయమైన చర్య అని, ఈ దాడిలో అమాయకులు నిండు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంటు పరిశీలకులు మోదుగుల వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ అసువులు బాసిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కిరాతకులను కఠినంగా శిక్షించాలన్నారు. దేశంలో ఇలాంటివి పునరావృతం కాకుండా, కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరూ గొంతెత్తి నినదించాలన్నారు. తప్పు చేసిన వారిని అణచివేయాలని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ప్రధాని నరేంద్ర మోడీ సరైన జవాబు చెప్పాలన్నారు. దేశం దమ్మును వారికి చాటి చెప్పాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్, తాడికొండ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్, పార్టీ నేతలు మెట్టు వెంకటప్పారెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ, మండేపూడి పురుషోత్తం, సీడీ భగవాన్, కొరిటెపాటి ప్రేమ్‌కుమార్, మామిడి రాము, నందేటి రాజేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
అంబటి రాంబాబు