కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,02,336 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,08,662 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.13,200 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.9,800 నుంచి రూ.13,800 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 44,778 బస్తాలు నిల్వ ఉన్నట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.
పసుపు ధరలు
దుగ్గిరాల: స్థానిక పసుపు యార్డుకు శుక్రవారం 698 బస్తాలు వచ్చాయి. మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొమ్ములు 520 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.11,200, గరిష్ట ధర రూ.12,250, మోడల్ ధర రూ.11,750 పలికింది. కాయలు 178 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.11,200, గరిష్ట ధర రూ.12,250, మోడల్ ధర రూ.11,750 పలికింది. మొత్తం 523.500 క్వింటాళ్ల అమ్మకాలు జరిగినట్లు యార్డు కార్యదర్శి తెలిపారు.
సంగీత కార్యక్రమంతో మహిళకు గిన్నిస్‌లో స్థానం
మాచవరం: మండలంలోని మోర్జంపాడు గ్రామ సచివాలయం–1 నందు గ్రామ వ్యవసాయ సహాయకురాలిగా విధులు నిర్వహిస్తున్న గారపాటి మణిదీప్తి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. హల్లెల్ మ్యూజిక్ స్కూల్ (విజయవాడ) వ్యవస్థాపకుడు పాస్టర్ అగస్టీన్ దండిగి ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ 1న నిర్వహించిన సంగీత పోటీల్లో 18 దేశాలకు చెందిన సుమారు 1,046 మంది సంగీత కళాకారులు ఆన్‌లైన్లో గంటపాటు సంగీత సరళి స్వరాలను కీబోర్డుపై ఆలపించి, వీడియోలను ఇన్‌స్ట్రాగామ్‌లో అప్‌లోడ్ చేశారు. అత్యుత్తమ సంగీత స్వరాలను అందించినందుకు మణిదీప్తికి గిన్నిస్ బుక్ వారు సర్టిఫికెట్‌ను, మెడల్‌ను అందించారు.

యార్డులో 1,08,662 బస్తాలు మిర్చి విక్రయం