
ఐదో రోజుకు మహా మంజీర నాదం నృత్యాలు
నగరంపాలెం: స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అన్నమయ్య కళావేదికపై 15వ అంతర్జాతీయ నృత్య దినోత్సవంలో భాగంగా మహామంజీర నాదం–2025 ఆదివారం ఐదో రోజుకి చేరాయి. శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో జరగ్గా, నూతలపాటి తిరుపతయ్య జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అనంతరం బాద్‌షా షేక్(పశ్చిమ బెంగాల్) మణిపురి నృత్యాన్ని, గోకుల్ శ్రీదాస్ (భువనేశ్వర్) ఒడిశా నృత్యాన్ని, డాక్టర్ శరత్‌చంద్ర (తిరుపతి) భరతనాట్యం ప్రదర్శించారు. సభికులను నృత్యాలు అలరించాయి. ఆరవేటి ప్రభావతి, డాక్టర్ కె.దేవేంద్ర పిళ్‌లైలకు ప్రముఖ భరత నాట్య గురువు మరంగంటి కాంచనమాల జీవిత పురస్కారం అందించారు. కళాకారులను సంస్థ కార్యదర్శి డాక్టర్ కాజ వెంకటసుబ్రహ్మణ్యం కళాకారులను యువ కళారత్న పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో తిరుపతి ఎస్‌వీ మ్యూజిక్ అండ్ డాన్స్ కళాశాల పూర్వ ప్రధానచార్యురాలు ఎస్.జానకిరాణి పాల్గొనగా, పఠాన్ మోహిముద్దిన్, వెంకటగిరి నాగలక్ష్మి పర్యవేక్షించారు.

ఐదో రోజుకు మహా మంజీర నాదం నృత్యాలు

ఐదో రోజుకు మహా మంజీర నాదం నృత్యాలు