
రైతుల్లో ఆసక్తి పెరిగింది..
ప్రకృతి వ్యవసాయంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఏటా ఈ వ్యవసాయం చేసే రైతుల సంఖ్య పెరుగుతోంది. ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాల సాగు ఎంతో మేలు. ఇది భూసారాన్ని పెంపొందిస్తోంది. రసాయనిక ఎరువుల ద్వారా రానురానూ భూసారం తగ్గిపోతోంది. ఈ ఖరీఫ్‌లో మరింతగా రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుని, ఆ మేరకు రైతులకు సూచనలు, సలహాలు ఇస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.
–నున్నా వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి
ఎంతో ప్రయోజనం
ప్రకృతి వ్యవసాయంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. గత ఖరీఫ్‌లో గుంటూరు జిల్లాలో 30 వేల నవధాన్యాల కిట్లు పంపిణీ చేశాం. ఈ ఖరీఫ్‌లో 52 వేల కిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులు ప్రయోజనం పొందుతున్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా రైతుల్లో చైతన్యం తీసుకువస్తున్నాం. ఈ నవధాన్యాల సాగు ద్వారా 55 రకాల పోషకాలు భూమికి అందుతాయి.
– కె.రాజకుమారి, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్
●

రైతుల్లో ఆసక్తి పెరిగింది..