ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి కృషి
నయీంనగర్/జనగామ రూరల్ : ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యల పరిష్కారంతోపాటు ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తానని, తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వరంగల్–ఖమ్మం–నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉపాధ్యాయులను కోరారు. మంగళవారం హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో, జనగామ జిల్లాకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా టీచర్ల సమస్యలపై తాను చేసిన పోరాటం, పరిష్కరించిన సమస్యలను గ్రహించాలని కోరారు. తాను గెలిచిన వెంటనే ముఖ్యమైన ఉపాధ్యాయ, అధ్యాపకుల, ప్రైవేట్ టీచర్ల పది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ధన రాజకీయాలకు, నిబద్ధతకు మధ్య ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఉపాధ్యాయులను కులం, మతం పేరుతో విభజించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆయా కార్యక్రమాల్లో మాణిక్‌రెడ్డి, సదానందం, సదాశివారెడ్డి, తాడూరు సుధాకర్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, వివిధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రావు, వెంకటేశ్, ఎన్‌ఎన్ రాజు, అంకూషావలి, చిక్కుడు శ్రీనివాస్, లక్ష్మయ్య, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment